Jennifer Gates | మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు (Microsoft co-founder) బిల్‌గేట్స్ (Bill Gates) తాత అయ్యారు. ఆయన కుమార్తె జెన్నిఫర్ గేట్స్ (Jennifer Gates) – నయెల్ నాజర్ (Nayel Nassar) దంపతులు పండంటి మొదటి బిడ్డ (First Child)కు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని జెన్నిఫర్ గేట్స్ (Jennifer Gates) సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. జెన్నిఫర్ (Jennifer Gates) – నయెల్ (Nayel Nassar) దంపతులు చిన్నారి పాదలను తమ చేతులతో పట్టుకున్న ఉన్న ఫొటోను షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జెన్నిఫర్‌కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. బిల్ గేట్స్ (Bill Gates), మెలిందా గేట్స్ (Melinda Gates) సైతం తల్లిదండ్రులైన తమ కుమార్తె, అల్లుడికి సోషల్ మీడియా ద్వారా కంక్రాట్స్ చెప్పారు. చాలా ప్రౌడ్‌గా ఉందంటూ పోస్టు పెట్టారు.
జెన్నిఫర్ (Jennifer Gates) -నయెల్ (Nayel Nassar) 2021 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2022 నవంబర్‌లో తాను ప్రెగ్నెంట్ అంటూ జెన్నిఫర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు బేబీ బంప్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది.