టెహ్రాన్ : తమ అణు స్థావరాలను మరింత ఎక్కువ శక్తితో పునర్నిర్మించుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెషికియన్ ఆదివారం ఆ దేశ మీడియాకు వెల్లడించారు. తమకు అణ్వాయుధం అవసరం లేదన్నారు. తమ దేశ అణు శక్తి సంస్థలో సీనియర్ మేనేజర్లను కలిసిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, వ్యాధుల నియంత్రణకు, ప్రజారోగ్యం కోసం తాము అణు స్థావరాలను పునర్ నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది జూన్లో ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే.