కీవ్: ‘మనం స్వర్గంలో కలుద్దాం’… అంటూ రష్యా దాడిలో మరణించిన తల్లికి ఉక్రెయిన్ చిన్నారి భావోద్వేగ లేఖ రాసింది. ఒక బాలిక స్వదస్తూరితో రాసిన లేఖ ఫొటోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారుడు అంటోన్ గెరాష్చెంకో ట్వీట్ చేశారు. బోరోడియంకాలో మరణించిన తల్లికి 9 ఏండ్ల బాలిక రాసిన లేఖ అని పేర్కొన్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారుపై రష్యా సైన్యం దాడులు చేసిందన్నారు.
కాగా, ఆ బాలిక రాసిన లేఖ మనసులను ద్రవింపజేస్తున్నది. ‘అమ్మా, ఈ ఉత్తరం మార్చి 8న నీకు ఇస్తున్న కానుక. తొమ్మిదేండ్ల నా జీవితాన్ని ఆనందమయం చేసినందుకు ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నందుకు కృతజ్ఞురాలిని. నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ అమ్మవి. నేను నిన్ను ఎప్పటికి మరువలేను. నువ్వు స్వర్గానికి వెళ్లాలని, అక్కడ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం స్వర్గంలో కలుద్దాం. నేను కూడా స్వర్గానికి వచ్చేందుకు మంచి అమ్మాయిగా ఉండటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని అందులో ఉన్నది. హృదయ విదారకంగా ఉన్న ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's the letter from 9-old girl to her mom who died in #Borodianka.
"Mom!
You're the best mom in the whole world. I'll never forget you. I wish you'll get in Heaven and be happy there. I'll do my best to be a good person and get in Heaven too. See you in Heaven!
Galia xx". pic.twitter.com/07l7vfQxM4
— Anton Gerashchenko (@Gerashchenko_en) April 8, 2022