టూరిస్టులతో వెళ్తున్న పడవలపై పెద్ద బండరాయి కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు టూరిస్టులు మృతి చెందారు. చాలామందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన భయంకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రెజిల్‌లోని ఓ చెరువులో టూరిస్టులతో కొన్ని చిన్న మోటర్ బోట్స్ వాటర్‌ఫాల్ సమీపం నుంచి వెళ్తున్నాయి. ఇంతలో పక్కనే ఉన్న పెద్ద కొండ నుంచి కొంత భాగం పగిలిపోయి.. కిందనే ఉన్న రెండు బోట్ల మీద పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు టూరిస్టులు మృతి చెందారు. మరో 30 మంది టూరిస్టులు గాయపడ్డారు. మరో 20 మంది టూరిస్టులు చెరువులో గల్లంతయ్యారు.
Horrific:
— RUFFLED_ZEN (@RUFFLED_ZEN) January 9, 2022
At least 6 killed in canyon wall collapse in southeastern Brazil
World
Sunday, 9 January 2022 | MYT 12:03 PM pic.twitter.com/Jc7n654jOb
వాటర్‌ఫాల్, పక్కనే చెరువు.. ఉండటంతో దాన్ని టూరిస్ట్ స్పాట్‌గా మార్చారు. ఇది బ్రెజిల్‌లోని సావో పాలోలో ఉంది. ఈ చెరువు దాదాపు 418 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ ఘటనను మరో పడవలో వెళ్తున్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఎవ్వరూ ఊహించని ప్రమాదం ఇది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.