Apollo Ocean : పశ్చిమాసియా (West Asia) దేశాల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ (Iran), ఇజ్రాయెల్ (Israel) పరస్పర దాడులతో మధ్యప్రాచ్యం దద్ధరిల్లుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ కమాండర్ (Iran Navy Commander) అలీ రెజా (Ali Reja) ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని దాటి మరో ఎల్పీజీ నౌక (LPG ship) భారత్‌కు చేరుకుంది.
అపోలో ఓషియన్ పేరుగల నౌక 16000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు వచ్చింది. ప్రస్తుతం ఆ నౌక నుంచి చమురు అన్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమ దేశంపై దాడులు చేసినప్పటి నుంచి ఇరాన్ హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాల నౌకలు జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తే బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించింది.
అయితే భారత్ సహా కొన్ని దేశాలకు చెందిన నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. దాంతో భారత్‌కు చెందిన ముడిచమురు, ఎల్పీజీ నౌకలు హర్మూజ్‌ను దాటుకుని భారత్‌కు చేరుకుంటున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు అపోలో ఓషియన్ భారత్‌కు భారత్‌కు చేరుకుంది.
#WATCH | Karnataka | Amid the ongoing conflict in West Asia, an LPG vessel, Apollo Ocean, arrived at the New Mangalore Port. pic.twitter.com/9WltnJ4Zaj
— ANI (@ANI) March 26, 2026