Iran Elections : ఇరాన్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran presidential election polling) జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ఎన్నికల అధికారులు (Election officer) భారత్లో కూడా మూడు ప్రధాన నగరాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భారత్లో ఇరాన్ రాయబారిగా పనిచేస్తున్న ఇరాజ్ ఇలాహి (Iraj Elahi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఈ ఏడాది మే నెల 19న హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ మూడో వారంలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో ఇప్పుడు మరోసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు. ఇరాజ్ ఇలాహి ఢిల్లీలో ఓటేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Ambassador of Iran to India, Iraj Elahi, casts his vote in the second phase of the presidential election of Iran at a polling centre in Delhi.
Iran lost its serving president Ebrahim Raisi, in a helicopter crash on May 19. pic.twitter.com/ooK9gfNBKK
— ANI (@ANI) July 5, 2024