పుతిన్ వార్నింగ్.. బైలైన్స్ ఎత్తేసిన వాషింగ్టన్ పోస్ట్.. డార్క్ వెబ్‌లో బీబీసీ
న్యూయార్క్: రష్యా గురించి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, ఛానళ్లకు అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశం గురించి తప్పుడు ప్రచారం చేస్తే 15 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామని పుతిన్ హెచ్చరించారు. దీని గురించి శుక్రవారం ఓ చట్టాన్ని కూడా చేశారు. దీంతో ఆ దేశంలో ఉన్న బీబీసీ, సీఎన్ఎన్, ఏబీసీ న్యూస్, సీబీఎస్ న్యూస్, బ్లూమ్బర్గ్లు తమ ఆపరేషన్స్‌ను బ్యాన్ చేశాయి. ఫేస్బుక్,ట్విట్టర్ కూడా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నాయని, వాటిని కూడా పుతిన్ నిషేధించారు. యాంటీ ఫేక్ న్యూస్ చట్టంతో ఉలిక్కిపడ్డ సీఎన్ఎన్.. రష్యాలో తన ఛానల్ ప్రసారాలను నిలిపేసింది.
అయితే వాషింగ్టన్ పోస్టు పత్రిక రష్యా నుంచి కథనాలను పోస్టు చేయనున్నది. కానీ రిపోర్టర్ల బైలెన్స్, డేట్లైన్స్ లేకుండా వార్తలను ప్రసారం చేసేందుకు వాషింగ్టన్ పోస్టు పత్రిక నిర్ణయం తీసుకున్నది. రష్యాలో ఉన్న తమ జర్నలిస్టుల క్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకున్నట్లు వాషింగ్టన్ పోస్టు చెప్పింది. ఇక బ్రిటన్‌కు చెందిన బీబీసీ .. ఉక్రెయిన్, రష్యా భాషల్లో ఉన్న తన వార్తా సర్వీసులను డార్క్ వెబ్‌లో ప్రమోట్ చేయనున్నట్లు ప్రకటించింది. బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా, రేడియో ఫ్రీ యూరోప్, రేడియో లిబర్టీ, డిట్యుషే వెల్లి, మెడుజా వెబ్సైట్లను కూడా రష్యా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

