ఒట్టావా, జూన్ 13: ప్రపంచంలోనే తొలిసారిగా ఆరోగ్య హెచ్చరికలను ప్రతి సిగరెట్‌పై ముద్రించేందుకు కెనడా ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇప్పటివరకు సిగరెట్ ప్యాకెట్‌పై మాత్రమే ‘ఆరోగ్యానికి హానికరం’ అని హెచ్చరికలు ఉండేవి. జూన్ 11 నుంచి దీనిపై ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని ఆ దేశ మానసిక ఆరోగ్య శాఖ మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. ప్యాకెట్‌పై సిగరెట్ తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు మరికొన్ని ప్రింట్ చేసే యోచనలో ఉన్నట్టు వివరించారు.