ప్రపంచ దేశాలన్నింటితో మిత్రత్వమే కోరుకుంటున్నాం : తాలిబాన్ సర్కార్
అమెరికాతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. కేవలం అమెరికాతో మాత్రమే కాకుండా… ప్రపంచ దేశాలన్నింటితోనూ తాము సత్సంబంధాలనే నెరుపుతామని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మంగళవారం కీలక ప్రకటన చేశారు.
గత 20 ఏళ్లుగా తాము యుద్ధాలు, రక్షణ రంగం అంటూ గడిపేశామని గుర్తు చేసుకున్నారు. దోహా ఒప్పందం తర్వాత వాటి గురించి మాట్లాడొద్దని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఇకపై వాటి ఊసే ఎత్తమని, అమెరికాతో సహా అన్ని దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
బాలికలకు విద్య అన్న విషయంపై హక్కానీ కీలక ప్రకటన చేశారు. బాలికలకు విద్యా సదుపాయం కల్పించే విషయంలో అతి తొందర్లోనే ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఓ పద్ధతి ప్రకారం ఈ విషయంపై వ్యవహరిస్తామని, స్త్రీ, పురుషులిద్దరికీ విద్య కావాలన్నదే తమ అభిమతమని సిరాజుద్దీన్ హక్కానీ స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

