రష్యా- ఉక్రెయిన్ వార్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా పోరులో ఉక్రెయిన్ ఓ కీలక దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. అయితే యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో మాత్రం చెప్పలేనని అన్నారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ కోసం ఎన్ని రోజులు పడుతుందో చెప్పడం అసాధ్యమని, అయితే కచ్చితంగా స్వేచ్ఛను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి తాము ఓ కీలక పరిణామ దశకు మాత్రం వచ్చామని జెలెన్స్కీ ప్రకటించారు.
ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలను రష్యా తాజా దాడుల్లో టార్గెట్ చేసింది. దాడులు మొదలై 13 రోజులు గడిచిన తర్వాత తొలిసారి ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలపై బాంబు వర్షం ప్రారంభించింది. పశ్చిమ ప్రాంతంలోని లుస్క్, ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరాలపై మిసైల్ దాడులు జరిగాయి. ఇవాళ ఉదయం ఆ అటాక్ జరిగినట్లు ఉక్రెయిన్ కూడా ద్రువీకరించింది. వైమానిక కేంద్రాలను మిస్సైళ్ల ద్వారా టార్గెట్ చేశారు. ఈ రెండు నగరాలతో పాటు డిప్రో ప్రాంతంపై కూడా మిస్సైళ్ల దాడి జరిగింది.