Volcano eruption | రష్యాలో శతాబ్ధాల నాటి అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం
Volcano eruption | రష్యా (Russia) లోని కమ్చట్కా (Kamchatka) ద్వీపకల్పంలో అగ్నిపర్వతం (Volcano) బద్ధలైంది. సుమారు ఆరు శతాబ్దాల కాలం నాటి క్రాషెనిన్నికోవ్ (Krasheninnikov) అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం సంభవించింది.
Volcano eruption : రష్యా (Russia) లోని కమ్చట్కా (Kamchatka) ద్వీపకల్పంలో అగ్నిపర్వతం (Volcano) బద్ధలైంది. సుమారు ఆరు శతాబ్దాల కాలం నాటి క్రాషెనిన్నికోవ్ (Krasheninnikov) అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఆదివారం జరిగిన ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల ఎత్తువరకు బూడిద, ధూళి ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి.
కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాని ప్రభావం వల్లే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతోందని రష్యా అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తు అది ప్రయాణిస్తున్న మార్గంలో ఎలాంటి జనావాసాలు లేవని, దాంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.
ఇప్పటివరకు జనావాస ప్రదేశంలోనూ బూడిద పడినట్లు సమాచారం లేదని రష్యా అధికారులు చెప్పారు. అయితే అగ్నిపర్వతం నుంచి ఇంకా స్వల్ప స్థాయిలో విస్ఫోటనాలు కొనసాగే అవకాశం ఉందని కమ్చట్కా వోల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీమ్ (KVERT) హెచ్చరించింది. ఈ విస్ఫోటనం జరిగిన సమయంలోనే 7.0 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు తెలిపింది.
‘చారిత్రక ఆధారాల ప్రకారం 600 ఏళ్లలో క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలవడం ఇదే తొలిసారి’ అని KVERT చీఫ్ ఓల్గా గిరినా తెలిపారు. అయితే స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూషన్కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ రికార్డుల ప్రకారం ఈ అగ్నిపర్వతంలో చివరి విస్ఫోటనం సుమారు 475 ఏళ్ల క్రితం జరిగిందని పేర్కొంది. అయితే ఈ కాలక్రమంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం సమీపంలోని మరో అగ్నిపర్వతాన్ని సందర్శించి తిరిగి వస్తున్న పర్యాటక గైడ్లు ఈ అరుదైన విస్ఫోటన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోలను రాయిటర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. 1,856 మీటర్ల ఎత్తున్న ఈ అగ్నిపర్వతంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం ప్రపంచవ్యాప్తంగా భూగర్భ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.
Read More >>
నిందితుడికి మద్దుతుగా అఫిడవిట్.. సీనియర్ ఐపీఎస్ అధికారికి సుప్రీంకోర్టు షోకాజ్
ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో
చాలాకాలం తర్వాత స్వల్పంగా బలపడ్డ రూపాయి
రాహుల్‌పై పరువునష్టం కేసులో సుప్రీం స్టే.. అయితే ఆ వ్యాఖ్యలపై మాత్రం ఆగ్రహం
సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

