Volcanic eruption | ఇండొనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. బాలి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి
Volcanic eruption | ఇండొనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి (Mount Lewotobi Laki Laki) అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది.
Volcanic eruption | ఇండొనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి (Mount Lewotobi Laki Laki) అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది మంగళవారం సాయంత్రం విష్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 10 వేల మీటర్లు (32,800 అడుగుల మేర) కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడుతోంది. భూమిని, ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తున్నది.
దీంతో విమాన సర్వీసుకుల తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అగ్నిపర్వతం విష్ఫోటనం కారణంగా బాలి (Bali)కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (Air India) తిరిగి ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది. అంతేకాదు పలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అనేక విమానాలు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, 1,584 మీటర్ల (5,197 అడుగులు) ఎత్తున్న లకిలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉన్నది. ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. గతేడాది నవంబర్‌లో కూడా బద్ధలైంది.
కాగా, ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికిపైగా మరణించారు. సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు.
Also Read..
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా
India – Canada | దౌత్యవేత్తల పునర్ నియామకానికి భారత్-కెనడా మధ్య కుదిరిన అంగీకారం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

