కీవ్, జూన్ 14: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనతో పాటు చాలా మంది బాడీగార్డులు ఉంటారు. అయితే అందులోని కొందరు బాడీగార్డులు మాత్రం పుతిన్ మలమూత్రాలను తీసుకెళ్తుంటారు.
ఆ మలమూత్రాలను ప్రత్యేక సూట్‌కేసులో జాగ్రత్తగా రష్యాకు తీసుకెళ్తారట. ఈ నమూనాల ద్వారా విదేశాలు ఆయన ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడంలో భాగంగానే ఇలా చేస్తారట. ఈ విషయాన్ని ఆయన 2017లో ఫ్రాన్స్ పర్యటనలో తొలిసారిగా గుర్తించారు. 2019లో సౌదీ అరేబియా పర్యటనలో ఇలాగే జరిగింది.