8 మంది దేశాధినేతలకు గోల్డ్ రింగ్‌లు గిఫ్ట్ ఇచ్చిన పుతిన్
Vladimir Putin gold ringరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్) దేశాధినేతలకు గోల్డ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ ఉంగరాలపై కామన్వెల్త్ గుర్తు ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మొత్తం 8 మంది దేశాధినేతలకు ఆయన ఉంగరాలను ప్రజెంట్ చేశారు. ఆ రింగ్‌లపై హ్యాపీ న్యూ ఇయర్
సెయింట్ పీటర్స్బర్గ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్) దేశాధినేతలకు గోల్డ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ ఉంగరాలపై కామన్వెల్త్ గుర్తు ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మొత్తం 8 మంది దేశాధినేతలకు ఆయన ఉంగరాలను ప్రజెంట్ చేశారు. ఆ రింగ్‌లపై హ్యాపీ న్యూ ఇయర్ 2023 అని ప్రింట్ చేసి ఉంది. సమావేశం జరుగుతున్న రష్యా దేశం పేరు కూడా ఆ రింగ్‌లపై ఉన్నది.
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, అజర్బైజాన్ అధ్యక్షుడు ఇలాహం అలియేవ్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ టొకయేవ్, కిర్గిస్తాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్, తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమ్మోలీ రహమాన్, తుర్కమిస్తాన్ అధ్యక్షుడు సర్దార్ బెర్డిమువమేదేవ్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోవేవ్, అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యావ్లకు పుతిన్ బంగారు ఉంగరాలను అందజేశారు.
లుకషెంకో ఒక్కరే ఆ రింగ్ ఇచ్చిన వెంటనే తొడుక్కున్నారు. పుతిన్ కూడా తన కోసం ఓ రింగ్‌ను ఉంచుకున్నారు. సీఐఎస్ దేశాలన్నీ ఒకప్పుడు సోవియేట్లో భాగమే. మాజీ సోవియేట్ సభ్యదేశాల మధ్య సహకారం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పుతిన్ గోల్డ్ రింగ్ గిఫ్ట్ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ జోకులు పేలుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

