వాషింగ్టన్: పారిశ్రామికవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి మంగళవారం ఒహి యో రిపబ్లికన్ గవర్నర్ ప్రైమరీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు. ఒకప్పుడు ఆయన అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడతారని అందరూ భావిం చారు. కాగా ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించిన రామస్వామి నవంబర్లో జరిగే ఎన్నికల్లో కొవిడ్ సమయంలో తన వైద్య సేవలతో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన డెమోక్రాటిక్ అభ్యర్థి అమీఆక్టన్పై సులభంగా విజయం సాధిస్తారని అంచనాలు ఉన్నాయి.