Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష(US President Elections) ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళుతున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున ఉన్న వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ తర్వాత రెండో స్థానానికి చేరారు. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం.. రామస్వామి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇక రిపబ్లికన్ పార్టీ తరపున జరుగుతున్న ప్రైమరీ పోల్స్‌లో 39 శాతం జీవోపీ ప్రాధమిక ఓట్లతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రథమ స్థానంలో కొనసాగుతుండగా.. డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్ ( Florida Governor Ron DeSantis) రెండు స్థానాలు తగ్గి ఒక్కసారిగా ఐదో స్థాననానికి పడిపోయారు. మరోవైపు మూడో స్థానంలో ఉన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) 13 శాతం ప్రాధమిక ఓట్లతో రెండో స్థానానికి చేరుకున్నారు. మరోవైపు భారత సంతతికి (Indo -American) చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ (Nikki Haley) 12 శాతం ఓట్లతో ముడో స్థానంలో కొనసాగుతుంది.