Trump-Zelensky : అమెరికా (USA) అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడు (America president) డొనాల్డ్ ట్రంప్ (Donald trump) – ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) జెలెన్స్కీ (Zelensky) మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరుదేశాల దౌత్యవేత్తల సమక్షంలో, అమెరికాతోపాటు అంతర్జాతీయ మీడియా ఆ సమావేశాన్ని కవర్ చేస్తున్న సమయంలో అగ్రనేతలు వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది.
అయితే వాగ్వాదం సందర్భంగా ఉక్రెయిన్ రాయబారి (Ukraine’s ambassador) ఒక్సానా మార్కరోవా (Oksana Markarova) ముఖంలో కనిపించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాగ్వాదం సందర్భంగా ఆమె ముఖంలో కాస్త ఆందోళన కనిపించింది. అయ్యో ఇలా జరుగుతుందేంటీ..? అన్నట్లుగా ఆమె తల పట్టుకుంది. మార్కరోవా హావభావాలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతున్నాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు.
Ukrainian Ambassador understands that Zelensky is a complete and total disaster… pic.twitter.com/2a6u7gNqfI
— Dan Scavino (@Scavino47) February 28, 2025
రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం మేలని, అందుకు ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడం కోసం జెలెన్స్కీ శుక్రవారం వైట్‌హౌస్‌కు వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ ట్రంప్‌పై ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. దాంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఒప్పందంపై ఎలాంటి సంతకాలు చేయకుండానే జెలెన్స్కీ వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు.