బ్యాంకాక్: ఒక ఏనుగు ఆహారం కోసం మళ్లీ అదే ఇంటిలోని వంటగదిలోకి ప్రవేశించింది. దీంతో పాత వీడియోతోపాటు ప్రస్తుత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో థాయ్‌లాండ్‌లోని చాలెర్మ్కియాత్ పట్టానా గ్రామంలోని రచ్చదవన్ ప్యూంగ్ప్రసోప్పన్ అనే మహిళ ఇంటి కిచెన్ గోడను ఒక ఏనుగు బద్దలు కొట్టింది. ఆ శబ్దానికి ఆమె మేల్కొని చూడగా ఏనుగు తన తొండాన్ని వంటింట్లోకి పెట్టి ఆహారం కోసం వెదికి దొరికింది తిన్నది. ఈ వీడియో నాడు వైరల్ అయ్యింది.
A family in Thailand awoke to a hungry Asian elephant busting through their wall and rummaging in the kitchen. The elephant, which is reportedly known to occasionally cause trouble for humans in the area, was likely attracted to the smell of food 🐘 pic.twitter.com/jD2xtXvEEz
— NowThis (@nowthisnews) June 22, 2021
అనంతరం ఏనుగు ధ్వంసం చేసిన గోడను నిర్మించారు. అయితే ఈ నెల 10న ఆ ఏనుగు మళ్లీ ఆ ఇంటి కిచెన్ గోడను బద్దలు కొట్టింది. తొండాన్ని లోపలికి పెట్టి ఆహారం కోసం వెదికి అందిన వాటిని తిన్నది. ఈసారి సుమారు పది వేలకుపైగా నష్టం కలిగించింది.
కాగా, బూంచుయే పేరుతో పిలిచే ఏనుగు ఈ గ్రామానికి తరచుగా వస్తున్నదని పార్క్ సూపరింటెండెంట్ తెలిపారు. స్థానికంగా మార్కెట్ జరిగేటప్పుడు ఆహారం వాసన వల్ల ఏనుగులు ఇక్కడకు వస్తుంటాయని చెప్పారు. కాగా, ఈ ఏనుగు కిచెన్‌లోకి ప్రవేశించిన గత వీడియోతోపాటు ప్రస్తుత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Remember the elephant that went viral in June for smashing through a home in Thailand? Well the same elephant just did it again — to the same people. pic.twitter.com/BxZjHux68n
— NowThis (@nowthisnews) August 10, 2021