Viral Video: పిల్లలు అంటేనే సాధారణంగా కొంటె పనులకు కేరాఫ్ అడ్రస్. బుడిబుడి నడకల వయసులో పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇంట్లో వస్తువులను పీకి పడేయడం, చేతికి పెన్ను, పెన్సిల్ లాంటివి దొరికితే ఎక్కడపడితే అక్కడ పిచ్చిగీతలు గీయడం చేస్తుంటారు. కానీ ఓ బుడతడు మాత్రం మరో అడుగు ముందుకేసి.. లిప్‌స్టిక్‌తో కారుపై తన ఇష్టం వచ్చిన గీతలు గీశాడు. తెల్ల కారుపై ఎర్ర రంగు గీతలు గీసి తన ట్రై సైకిల్‌పై క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు.
ఈ కొంటె ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికాలోని న్యూజెర్సీ నుంచి మొరిస్సా స్క్వార్జ్ అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బుడ్డోడి కొంటె చేష్ట చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కేవలం 7 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ఒక్కరోజులోనే 99 వేల వ్యూస్ వచ్చాయి. 413 మంది లైక్ చేశారు.
ఇక వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. బుడ్డోడి క్రియేటివిటీ సూపర్ అని మెచ్చుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ తుంటరి బుడతడి వీడియోను మీరు కూడా ఒకసారి చూసి కాసేపు నవ్వుకోండి..
He’ll own a body shop one da 😂 pic.twitter.com/Jhx6qOxY95
— Morissa Schwartz (Dr. Rissy) (@MorissaSchwartz) October 20, 2022