Viral Photo | అమెరికాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెకార్తీ తీసిన ఓ అద్భుతమైన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) సూర్యుడి ముందు నుంచి వెళ్తున్నది. అదే సమయంలో సూర్యుడి నుంచి వెలువడుతున్న సౌర తాపాన్ని తన కెమెరాలో బంధించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని సోనోరన్ ఎడారిలో ఆయన తన కెమెరాలో బంధించారు. అలాంటి అందమైన ఫొటోలు తీయడంలో ప్రసిద్ధుడైన ఆండ్రూ మెకార్తీ ఈ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @cosmic_background లో షేర్ చేశాడు.
ఎస్ఎస్ఎస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ వద్ద ఓ శక్తివంతమైన శక్తివంతమైన విస్పోటనం జరిగిందని.. అదే సమయంలో ఈ అద్భుతమైన చిత్రాన్ని బంధించగలిగానని.. ఇది తన జీవితంలో మరచిపోలేని క్షణమని మెకార్తీ పేర్కొన్నారు. ఈ ఫొటోకు ఆయన ‘Kardashev Dreams’ అని పేరు పెట్టారు. ఇది సోవియట్ ఖగోళ శాస్త్రవేత్త నికొలాయ్ నికోలాయ్ కర్దాషెవ్కు అంకితం ఇచ్చారు. ప్రపంచ మానవ నాగరిత ఎంతగా సాంకేతికంగా అభివృద్ధి చెందిందో అంచనా వేసే కర్దాషెవ్ స్కేల్‌ను రూపొందించిన శాస్త్రవేత్త ఆయనే.
వైరల్‌గా మారిన ఫొటో విశేషానికి వస్తే.. ఒకేసారి సూర్యుడి ముందు నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దూసుకెళ్తుండగా.. అదే సమయంలో సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన సౌర ఫ్లేర్స్ రావడం కనిపిస్తున్నది. ఈ రెండు సంఘటనలను ఒకే ఫ్రేమ్‌లో బంధించడం అరుదైన విషయం. ఈ ఫొటో తీసే సమయంలో సుమారు 121 డిగ్రీల ఫారిన్ హీట్ సుమారు (49.5 డిగ్రీల ఉష్ణోగ్రత) ఉన్నది. అంతటి ఎండలో టెలిస్కోప్, కంప్యూటర్లను సురక్షితంగా ఉంచుకునేందుకు ఐస్ ప్యాక్‌లు, థర్మో ఎలక్ట్రికల్ కూలర్స్‌ను ఉపయోగించారు. ఇప్పటి వరకు తాను తీసిన ఫొటోల్లో ఇదే బెస్ట్ ఫొటో అని మెకార్తీ పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతున్నది.