ఆయనో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. సిమెంట్, ఇటుకలతో ఇల్లు కట్టడం గొప్పేం కాదనుకొన్నాడు.. ఇల్లంతా బంగారంలా మెరిసిపోతే ఎలా ఉంటుంది? అని ఆలోచించి.. ఇల్లును బంగారంగా మార్చేశాడు. ఇప్పుడు ఈ ఇల్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇంటి గోడలు, కిటికీలు, తలుపులు ఇలా మొత్తం బంగారం పూత, రంగుతో తీర్చిదిద్దాడు. ఈ ఇల్లును చూడాలంటే మనం వియత్నాంలోని కాన్థో నగరానికి వెళ్లాల్సిందే.