మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తన కాళ్లు, పాదాన్ని పదే పదే కదిలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై మరోసారి అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ తన కాళ్ళు, పాదాలను నిరంతరం కదిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వెల్లువెత్తాయి.
కాగా, ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల సలహాదారుడు ఆంటోన్ గెరాష్చెంకో కూడా ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. పుతిన్ పదే పదే కాళ్లు కదపడం మోర్స్ కోడా? అని సందేహం వ్యక్తంచేశారు. పలువురు నెటిజన్లు కూడా భిన్నంగా కామెంట్లు చేశారు. పుతిన్ కాళ్ల కదలికలపై ఎగతాళి చేశారు. ఆయనకు ఏదో అయ్యిందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. పుతిన్ అనారోగ్యంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నదని మరొకరు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఓడిపోతున్నదని, పుతిన్ ఆరోగ్య పరిస్థితి కూడా అదే విధంగా దిగజారుతున్నదని మరొకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ నెల 24తో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది పూర్తి కానున్నది.
Putin's feet during his meeting with Lukashenko.
Is this Morse code? pic.twitter.com/eRmvSBDQOn
— Anton Gerashchenko (@Gerashchenko_en) February 17, 2023