దర్శకుడు అనిల్ రావిపూడిది అపజయం ఎరుగని ప్రయాణం. అందుకే ఆయన్నంతా ‘హిట్ మిషిన్’ అంటుంటారు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సందడి చేసి మూడొందల కోట్ల విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. మళ్లీ ఈ సంక్రాంతిని కూడా టార్గెట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు విక్టరీ వెంకటేశ్‌ని కూడా తోడు తీసుకొని ‘మన శంకరవరప్రసాద్‌గారు’తో ఈ నెల 12న ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు అనిల్ రావిపూడి.