న్యూయార్క్ : కుక్కపిల్లలను వాకింగ్‌కు తీసుకువెళ్లే పప్పీ బస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాస్కా స్కాగ్వేలో ఈ వీడియో రికార్డు చేయగా ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ క్లిప్‌ను 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. డాగ్ వాకర్ జంట లీ, మో థాంప్సన్ తమ డాగ్ వాకింగ్ సెషన్ నుంచి టిక్‌టాక్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోలో బస్సులోకి కుక్కలు ఎంటరై తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవడం కనిపించింది. లీ, మో దంపతులు డాగ్ వాకింగ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. వారి వ్యాపారం మెరుగుపడిన తర్వాత బస్సులో కుక్కలను పికప్ చేసుకోవడం ప్రారంభించారు.
ఈ క్లిప్‌లో కుక్కలు బస్‌లో ఎక్కి తమ సీట్లో కూర్చోగానే అవి పడిపోకుండా సీటు బెల్టు అమర్చడం కనిపిస్తుంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు పప్పీ బస్ నిర్వాహకులపై ప్రశంసలు గుప్పించారు.