లండన్ : బ్యాండ్, బాజా, బారాత్ లేకుండా దేశీ పెండ్లిండ్లను ఊహించలేం. ఒక్కో వర్గానికి ఒక్కో తీరుగా ఆచార వ్యవహారాలున్నా పెండ్లి తంతులో మాత్రం సంబరాలు అంబరాన్ని అంటేలా ఉంటాయి. ఇదే తరహాలో లండన్‌లో జరిగిన దేశీ బారాత్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
Angrezon se band and dhol bajwa rahe hain Punjabi :). Classic Revenge by Indians.
( on a lighter note guys) pic.twitter.com/DPmp5UByRZ
— Gurmeet Chadha (@connectgurmeet) January 20, 2023
ఈ క్లిప్‌ను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 1.38 లక్షల మంది వీక్షించారు. ఈ బారాత్‌లో కొత్తదనం ఏంటనేది వీడియో పూర్తయ్యేవరకూ చూస్తే తెలిసిపోతుంది. కంప్లీట్ సర్కిల్ వెల్త్ మేనేజింగ్ పార్టనర్, సీఐఓ గుర్మీత్ చద్దా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. లండన్‌లో ఈ వీడియోను షూట్ చేయగా నేత్రపర్వంగా సాగిన దేశీ వెడ్డింగ్ బారాత్‌ను చూడొచ్చు.
బ్రిటిషర్లు బ్యాండ్ వాయించడం ఈ వీడియో ప్రత్యేకత కాగా పెండ్లి కొడుకు ఆశీనుడైన గుర్రాన్ని కూడా బ్రిటిష్ వ్యక్తి హ్యాండిల్ చేయడం కనిపిస్తుంది. పంజాబీ వెడ్డింగ్‌కు బ్యాండ్ వాయించిన ఆంగ్లేయులు..మనోళ్ల క్లాసిక్ రివెంజ్..! అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు.