వాషింగ్టన్: కొత్త ఏడాది ఆరంభంలో విషాదం జరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న జనం మీదకు ఒక కారు దూసుకెళ్లింది. (vehicle rams into crowd) ఈ సంఘటనలో పది మంది మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని తెలుస్తున్నది. అమెరికాలోని న్యూ ఓర్లీన్స్లో ఈ సంఘటన జరిగింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బోర్బన్ స్ట్రీట్‌లో నూతన సంవత్సర వేడుకలకు వేలాది మంది తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఒక కారు వేగంగా అక్కడున్న జనంపైకి దూసుకెళ్లింది. దీంతో సుమారు పది మంది అక్కడికక్కడే మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సంఘటన తర్వాత వాహనం డ్రైవర్ కిందకు దిగి కాల్పులు జరిపినట్లు అక్కడున్న కొందరు వ్యక్తులు తెలిపారు. దీంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరుపడంతో ఆ వ్యక్తి పారిపోయినట్లు చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో బోర్బన్ స్ట్రీట్‌ను పోలీసులు బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ బీభత్సానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BREAKING NEWS: GRAPHIC WARNING: Mass casualties as car rams into crown in New Orleans. Several dead… Bourbon Street shut down … I knew this would happen somewhere #terroristattack #ThanksBiden pic.twitter.com/oVroB6wdyU
— Mighty_Marsha (@Mighty_Marsha) January 1, 2025