వాషింగ్టన్, నవంబర్ 9: రష్యాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. ఇటీవల రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.
ఇంధన సరఫరా విషయంలో రష్యా నమ్మదగ్గ దేశం కాదని తెలిపింది. అమెరికా, భారత్ మధ్య స్నేహం ఈనాటిది కాదని, ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న ఈ స్నేహబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని కోరింది. భారత్కు సహాయకారిగా ఉండటానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని వెల్లడించింది.