శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 09:17:06

అమెరికాలో 3.5 మిలియన్ల కరోనా కేసులు

అమెరికాలో 3.5 మిలియన్ల కరోనా కేసులు

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తుండడంతో అమెరిన్లు విలవిలలాడుతున్నారు. గురువారం వరకు ఆ దేశంలో 3.5 మిలియన్ల మంది ఈ మహమ్మారి బారినపడినట్లు ప్రఖ్యాత జాన్‌ హోప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. కరోనా మరణాల్లోనూ ప్రపంచంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ముందున్నాయి. ఇప్పటివరకు వైరస్‌ బారినపడి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 1,37,864 మంది మృతి చెందారు.

18 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని వైట్‌హౌజ్‌ కరోనా టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. క్యాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, ఓక్లొహమా, టెక్సాస్‌ తదితర రాష్ట్రాల్లో వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా గడిచిన 24గంటల వ్యవధిలో ఆ దేశంలో కొత్తగా 68,428 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 950 మంది తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు గురై మృతి చెందారు.logo