వాషింగ్టన్: ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) తీసుకోవాలనుకొనే ఎఫ్-1 విద్యార్థులు లేదా సైన్స్, సాంకేతికత, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో ఓపీటీ పొడిగించుకోవాలనుకునేవారి దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ను విస్తరిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
ఫామ్ ఐ-765 పెండింగ్ ఉన్న విద్యార్థులు, ఉద్యోగ అధికార పత్రం కోసం దరఖాస్తు చేసినవారు ఫామ్ ఐ-907 ద్వారా ప్రీమియం ప్రాసెసింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విభాగాల్లో ఎఫ్-1 విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వలస అనుభవాన్ని ఈ విధానం ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొస్తుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) డైరెక్టర్ జడ్డౌవ్ పేర్కొన్నారు.