US Open doors foreigners | కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీ ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. భూభాగంపై నుంచి గానీ, విమానయానం ద్వారా గానీ వచ్చేవారిని అనుమతిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నవారికి నవంబర్ 8 నుంచి తమ సరిహద్దులు తెరుస్తున్నట్లు వైట్‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ కార్యదర్శి కెల్విన్ మునోజ్ తెలిపారు.
నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి విమానయాన నిబంధనలను సడలిస్తున్నామని కెల్విన్ మునోజ్ చెప్పారు. ఇప్పటికే పొరుగున ఉన్న కెనడా, మెక్సికో పౌరులను ఈ వారం ప్రారంభం నుంచి అనుమతించిన సంగతి తెలిసిందే. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన వ్యాక్సిన్లను వేసుకున్న విదేశీయుల్ని అనుమతిస్తున్నట్లు కెల్విన్ మునోజ్ వెల్లడించారు.