Iran War | ఇరాన్ యుద్ధంతో భారీగా నష్టపోతున్న అమెరికా.. రోజుకు రెండు బిలియన్ డాలర్ల ఖర్చు!
Iran War |ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతున్నది. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఏకంగా 11.3 బిలియన్ డాలర్లను (సుమారు రూ.1.07 లక్షల కోట్లు) అమెరికా వెచ్చించింది. రోజుకు సగటున 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నది.
Iran War | వాషింగ్టన్, మార్చి 27 : ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతున్నది. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఏకంగా 11.3 బిలియన్ డాలర్లను (సుమారు రూ.1.07 లక్షల కోట్లు) అమెరికా వెచ్చించింది. రోజుకు సగటున 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నది. యుద్ధం కోసం మరో 200 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.18.9 లక్షల కోట్లు) ఇవ్వాలని ఇటీవలే పెంటగాన్ వైట్‌హౌస్‌ని కోరింది. మరోవైపు ఆయుధ నిల్వలు కరిగిపోతున్నాయి. ఇరాన్ దాడులతో గల్ఫ్‌లోని అమెరికా బేస్‌లకు భారీ నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ యుద్ధం అమెరికాకు మోయలేని భారంగా మారుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆయుధాల మళ్లింపు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించిన ఆయుధాలను అమెరికా దారి మళ్లించి ఇరాన్‌పై యుద్ధంలో వినియోగించాలని యోచిస్తున్నది. 28 రోజులుగా ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా, ఇప్పటికే అమెరికా అత్యంత విలువైన, అరుదైన ఆయుధ సామగ్రి నిల్వలు ఆయుధగారం నుంచి కరిగిపోయాయన్న పెంటగాన్ ఆందోళనలను వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఈ విషయంపై పెంటగాన్‌లో నిజమైన చర్చ జరుగుతున్నదని, దీనితో సంబంధమున్న ముగ్గురు కీలక వ్యక్తులను ఉటంకిస్తూ పేర్కొన్నది. దారి మళ్లించాలనుకుంటున్న వాటిలో ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, మరికొన్ని విలువైన ఆయుధాలు ఉన్నాయి.
నాటో కూటమి సమిష్టి నిర్ణయం మేరకు ఇవన్నీ ఉక్రెయిన్‌కు సరఫరా చేయడానికి అమెరికా కొన్ని సంస్థలకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. ఇవన్నీ కీవ్‌కు తరలించాల్సి ఉండగా, ఇరాన్ యుద్ధం రావడంతో వాటినన్నింటినీ అమెరికా వాడాలని యోచిస్తున్నది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ నాలుగు వారాల్లో యూఎస్ సెంట్రల్ కమాండ్ 9,000 లక్ష్యాలను ఛేదించిందంటే వారి ఆయుధ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాగా, తాము రష్యాతో నాలుగేండ్లుగా జరుపుతున్న యుద్ధంలో వినియోగించిన దాని కన్నా అమెరికా, దాని మిత్ర దేశాలు కేవలం మూడు రోజుల వ్యవధిలో 800 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు ప్రయోగించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాపోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

