వాషింగ్టన్, జనవరి 26: ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు అమెరికా స్టార్టప్ వీసాను ప్రవేశపెట్టనున్నది. సృజనాత్మకతకు ద్వారాలు తెరిచేందుకు ఉద్దేశించిన అమెరికా కంపీట్స్ యాక్ట్‌లో భాగంగా ఈ వీసాను తెస్తున్నారు. మంగళవారం ఈ చట్టాన్ని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. అమెరికాలో స్టార్టప్‌లు స్థాపించేవారికి ‘డబ్ల్యూ -1’, వారు తెచ్చుకునే ఉద్యోగులకు ‘డబ్ల్యూ-2’ అనే వీసాలు ఇస్తారు. స్థాపించే కంపెనీని బట్టి ఉద్యోగులను ఎంతమందినైనా తెచ్చుకోవచ్చని అంటున్నారు. అయితే వారు అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో లేదా ఏదైనా దేశంలోని తత్సమానమైన సంస్థలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌లో డాక్టోరల్ డిగ్రీ చేసి ఉండాలి.