భారత్లో మైనారిటీలపై విద్వేషం ఆందోళనకరం: బ్లింకెన్
భారతదేశంలో మైనారిటీల స్థితిగతులపై అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: భారతదేశంలో మైనారిటీల స్థితిగతులపై అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై వార్షిక స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక, 2023 విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్లో మత మార్పిడుల నిరోధక చట్టాలు, మైనారిటీలపై విద్వేష ప్రసంగాలు, మైనారిటీల ప్రార్థనా స్థలాలు, ఇళ్ల కూల్చివేతలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని 10 రాష్ర్టాల్లో మత మార్పిడులను కట్టడి చేసే చట్టాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.
మరికొన్ని వార్తలు చదవండి..
మాల్దీవుల అధ్యక్షుడిపై చేతబడి.. ఇద్దరు మంత్రుల అరెస్ట్
మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై చేతబడి చేశారని ఆరోపిస్తూ ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ శాఖ మంత్రి షమనాజ్ సలీం, ఆమె భర్త ఆదం రమీజ్లతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గురువారం స్థానిక మీడియా తెలిపింది.
ఆదం దేశాధ్యక్ష కార్యాలయంలో మంత్రిగా పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే పోలీసులు దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు నిరాకరించారు. మాలే నగర మేయర్గా ముయిజ్జు, కౌన్సిల్ సభ్యులుగా షమనాజ్, రమీజ్ ఒకే సమయంలో పని చేశారు. ఆ కాలంలో ముయిజ్జుకు రమీజ్ సన్నిహితుడిగా వ్యవహరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

