వాషింగ్టన్: అరుదైన H5N5 బర్డ్ ఫ్లూ(H5N5 Bird Flu) వైరస్‌తో అమెరికాలో ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వైరస్ వల్ల ప్రస్తుతానికి పబ్లిక్కు ఎటువంటి రిస్క్ లేదని అధికారులు చెప్పారు. వాషింగ్టన్కు చెందిన ఆ వ్యక్తికి కొన్నాళ్లుగా ఆరోగ్యం సరిగా లేదు. H5N5 వైరస్ సోకిన తొలి అమెరికా వ్యక్తిగా అతన్ని గుర్తిస్తున్నారు. దీనిపై వాషింగ్టన్ ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది.
సియాటిల్‌కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేస్ హార్బర్ కౌంటీకి ఆ వ్యక్తి చెందినట్లు చెబుతున్నారు. అతని ఇంటి వద్ద పౌల్ట్రీ ఉన్నట్లు తెలుస్తోంది. బర్డ్స్‌కు ఎక్స్పోజ్ కావడం వల్ల వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. వైరస్ పరీక్షలో ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా పాజిటివ్ వచ్చినవాళ్లు ఎవరూ లేరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వైరస్ సోకిన వ్యక్తితో కాంటాక్ట్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించనున్నారు. ప్రజల మధ్య వైరస్ సోకుతున్నట్లు ఆధారాలు లేవన్నారు.