AI In Military Operations : 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీ లాంఛ్ అనంతరం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై హాట్ డిబేట్ సాగుతోంది. లేటెస్ట్ టెక్నాలజీని వివిధ రంగాల్లో వాడేందుకు పలువురు మొగ్గుచూపుతున్నారు. ఇక సైనిక కార్యకలాపాల్లోనూ ఏఐ వాడకం విస్తృతం కానుంది. సైనిక కార్యకలాపాల్లో ఇప్పటికే అమెరికా ఏఐ టెక్నాలజీని వాడుతోందని బ్లూంబర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ నెల ఆరంభంలో మధ్య ప్రాచ్యంలో వైమానిక దాడులకు టార్గెట్లను నిర్ధిష్టంగా గుర్తించేందుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్టు ఈ రిపోర్ట్ పేర్కొంది. యుద్ధ పరిస్ధితుల్లో ఏఐ వాడకాన్ని అమెరికా సైన్యం ప్రారంభించిందని తెలిపింది. వైమానిక దాడులకు లక్ష్యాలను గుర్తించేంఉదకు పెంటగాన్ కంప్యూటర్ విజన్ అల్గారిథమ్స్‌ను రంగంలోకి దించాయని ఈ కథనం పేర్కొంది.
మధ్యప్రాచ్యంలో ఈనెల 2న నిర్వహించిన మిషన్‌లో ఏఐ అల్గారిథమ్స్ సాయంతోనే 85కిపైగా వైమానిక దాడులు చేపట్టినట్టు తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇరాక్, సిరియాలోని రాకెట్స్, మిసైల్స్, డ్రోన్ స్టోరేజ్, మిలీషియా ఆపరేషన్స్‌ను గుర్తించి టార్గెట్స్‌పై విరుచుకుపడింది. రక్షణ విభాగంలో ఆటోమేషన్ పెంచేందుకు 2017లో ఏర్పాటైన ప్రాజెక్ట్ మావెన్లో భాగంగా ఎయిర్‌స్ట్రైక్స్‌కు అవసరమైన అల్గారిథమ్స్‌ను అభివృద్ధి చేసినట్టు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ టెక్నాలజీ అధికారి మూర్ తెలిపారు.
Read More :