వాషింగ్టన్, ఆగస్టు 20 : భారత్కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆంక్షలు విధించాలని మత స్వేచ్ఛపై అమెరికా ఏర్పాటుచేసిన సలహా మండలి అధికారులు యూఎస్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఆ సంస్థ నాయకులతో ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు పాటించ వద్దని, ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు.
యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) చైర్పర్సన్ ఆసిఫ్ మహ్మద్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆర్ఎస్ఎస్ సభ్యుడేనని, అది ఒక గొడుగు సంస్థ అని తెలిపారు. దాని ఉప సంస్థలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలపై దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈనెల 29న న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూఎస్ పర్యటనకువెళ్తున్న క్రమ ంలో మహమూద్ ఈ వ్యాఖ్యలు చేశారు.