అమెరికా : బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరవుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే ఎలిజబెత్ అంత్యక్రియలకు సంబంధించి తనకు సమాచారం తెలియదు. కానీ అంత్యక్రియలకు వెళ్తానని తెలిపారు. సెప్టెంబర్ 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 తనకు తెలుసని చెప్పారు. కానీ ఆయనకు ఎలాంటి కాల్ చేయలేదన్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.