బీజింగ్, మే 13: అత్యంత కీలకమైన శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రశ్రేణి వ్యాపార నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం చైనాలోని బీజింగ్‌కు చేరుకున్నారు. ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న క్రమంలో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను స్థిరీకరించడానికి ట్రంప్ కొత్త ఒరవడిని తీసుకువచ్చారు.
రాజకీయంగా ట్రంప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఇది జరుగుతున్నది. ఈ పరివారంలో ఎలాన్ మస్క్, జెన్సాన్ హువాంగ్ కూడా ఉన్నారు. ట్రంప్‌కు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్, సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. కాగా, గురువారం ఉదయం జరిగే ఒక అధికారిక కార్యక్రమంలో ట్రంప్‌నకు అధ్యక్షుడు లీ జిన్‌పింగ్ స్వాగతం పలుకుతారని భావిస్తున్నారు.