వాషింగ్టన్: సంపద, అధికారం, పలుకుబడిగల కొంతమందితో కూడిన కూటమి రూపుదిద్దుకుంటున్నదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఈ కూటమి వల్ల అమెరికా ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలకు నిజమైన ముప్పు కలుగుతుందని హెచ్చరించారు. అమెరికన్లపై మితిమీరిన సంపన్న టెక్-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎదురులేని అధికారాన్ని చెలాయించవచ్చునన్నారు.
ఆయన పదవీ కాలం ముగుస్తుండటంతో బుధవారం వీడ్కోలు సభలో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. తన పదవీ కాలంలో ఉద్యోగాలను సృష్టించానని, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశానని, ఆరోగ్య సంరక్షణ, కొవిడ్-19 మహమ్మారి నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చానని తెలిపారు. అమెరికాను సురక్షిత దేశంగా తీర్చిదిద్దానన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.