Precision Strike Missile: కొత్త ప్రిసిషన్ స్ట్రయిక్ మిస్సైల్‌ను వాడిన అమెరికా.. వీడియో
Precision Strike Missile: ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై జరిగిన దాడిలో అమెరికా కొత్త ప్రిసిషన్ స్ట్రయిక్ మిస్సైల్‌ను వాడినట్లు తెలుస్తోంది. ఆ క్షిపణి టార్గెట్‌కు సమీపంలో కొత్త ఎత్తులోనే పేలుతుంది. దాని నుంచి టంగ్స్టన్ పెల్లెట్లు రిలీజ్ అవుతాయి. ఆ విధ్వంసకర క్షిపణి గురించి ఆర్మీ కన్ఫర్మేషన్ ఇచ్చింది.
వాషింగ్టన్: ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజున కొత్త ప్రిసిషన్ స్ట్రయిక్ మిస్సైల్(Precision Strike Missile)ను వాడినట్లు వార్తలు వెలుబడుతున్నాయి. లామెర్ద్ సిటీలో దాన్ని వినియోగించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని రాసింది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి పీఆర్ఎస్ఎమ్ను అమెరికా దళాలు తొలి రోజు ఇరాన్‌పై వినియోగించినట్లు కథనంలో తెలిపారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా నిపుణులు ఈ నిర్ధారణకు వచ్చారు. లామెర్ద్ సిటీలో ఉన్న స్పోర్ట్స్ హాల్‌పై దాడి చేశారు. ఓ స్కూల్ బిల్డింగ్ సమీపంలో అది పేలింది.
ప్రిసిషన్ స్ట్రయిక్ మిస్సైల్ టార్గెట్‌కు సమీపంలో కొంత ఎత్తులోనే పేలిపోతుంది. ఆ తర్వాత ఆ పేలుడు నుంచి టంగ్స్టన్ పెల్లెట్లు రిలీజ్ అవుతాయి. ప్రిసిషన్ క్షిపణికి 2025లోనే టెస్టింగ్ చేశారు. ఇప్పటి వరకు ఈ క్షిపణిని ఏ యుద్ధంలోనూ వాడలేదు. తొలిసారి ఇరాన్‌పై ఆ మిస్సైల్‌తో దాడి చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రిసిషన్ క్షిపణి వల్ల 21 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. బిల్డింగ్‌కు సమీపంగా రాగానే మిస్సైల్ పేలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. స్పోర్ట్స్ హాల్ సమీపంలో ఉన్న ఐఆర్జీసీ కాంపౌండ్‌పై అమెరికా దాడి చేసినట్లు భావిస్తున్నారు.
గత ఏడాది ప్రిసిషన్ క్షిపణికి చెందిన ప్రోటోటైప్ టెస్టింగ్ జరిగినట్లు ఆర్మీ తన ప్రకటనలో తెలిపింది. తొలిసారి ప్రిసిషన్ క్షిపణి వాడినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ స్థానంలో ప్రిసిషన్ మిస్సైల్ ను డిజైన్ చేశారు. అమెరికా ఆర్మీ, మెరైన్ కార్ప్స్ దీన్ని వాడుతోంది. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. 400 మైళ్ల దూరంలో ఉన్న టార్గెట్లను ఇది చేరుకోగలదు. కానీ వెపన్ అక్యూరెసీ గురించి మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. అయితే ఇరాన్‌పై దాడి చేసిన తొలి రోజే మినాబ్ సిటీలో ఉన్న బాలికల పాఠశాలపై తోమాహాక్ క్షిపణితో అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 175 మంది మరణించారు.
🔥 Cataclysmic 🚀🚀
📍 Iran : CCTV footage appears to show a likely US Precision Strike Missile (PrSM) hitting a residential area and sports hall in Lamerd on the first day of the Iran War, killing 21 people.
……View more pic.twitter.com/wF4oBwUBCo
— INN Iran National News (@INNewx) March 29, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

