Lahore | లాహోర్: లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ లక్ష్యంగా దాడులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఆ నగరాన్ని వెంటనే వీడాలని అమెరికా తన పౌరులకు గురువారం అడ్వైజరీ జారీ చేసింది.
ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లే అవకాశం లేనివారు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని కోరింది. లాహోర్లోని అమెరికా రాయబార కార్యాలయం తన సిబ్బందికి ఆదేశాలను జారీ చేసింది. భద్రత దృష్ట్యా ఘర్షణలు జరిగే ప్రాంతాలను వదిలి వెళ్లాలని సూచించింది.