2 రోజులు.. 170 టార్గెట్లు.. ఇరాన్‌పై దాడులు ఉధృతం చేసిన అగ్రరాజ్యం అమెరికా
ఇరాన్‌పై అమెరికా గురువారం తెల్లవారుజామున భీకర దాడులతో విరుచుకుపడగా ఇందుకు ప్రతిస్పందనగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు జరిపింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు కుదుర్చుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మనుగడకు ముప్పు ఏర్పడింది.
- అణు విద్యుత్ కర్మాగారం సమీపంలో భారీ పేలుళ్లు
- చాబహార్ పోర్టు పైనా దాడి
- దీటుగా బదులిచ్చిన ఇరాన్
- కువైట్, బహ్రెయిన్,ఖతార్‌లోని అమెరికా బేస్‌లపై ప్రతి దాడులు
దుబాయ్, జూలై 9 : ఇరాన్‌పై అమెరికా గురువారం తెల్లవారుజామున భీకర దాడులతో విరుచుకుపడగా ఇందుకు ప్రతిస్పందనగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు జరిపింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు కుదుర్చుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మనుగడకు ముప్పు ఏర్పడింది. బుధవారం మొదలైన పరస్పర దాడులు గురువారం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియా అంతటా దాడుల హెచ్చరికల సైరన్లతో మార్మోగింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్‌లో కనీసం మూడుసార్లు సైరన్లు హోరెత్తాయి. కువైట్, ఖతార్ లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి.
అమెరికా బలగాలు, యుద్ధ విమానాలు బసచేసిన జోర్దాన్‌లో కూడా గురువారం మధ్యాహ్నం సైరన్లు మార్మోగాయి. ఇరాన్‌లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని గురువారం సాయంత్రం అమెరికా వైమానిక దాడి చేసిందని ఇరాన్‌కు చెందిన ఒక అధికారి ఆరోపించారు. అలాగే మధ్యాహ్నం దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. భారత్ సహకారంతో నిర్మిస్తున్న చాబహార్ పోర్టుపైనా అమెరికా దాడులు చేసింది. మొత్తంగా గత రెండు రోజుల్లో 170 లక్ష్యాలపై దాడులు చేసింది. హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలికాయని, ఒకవేళ ఇరాన్ దాడులు ఆపకపోతే ఘర్షణ తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి.
ఖమేనీ మృతదేహానికి ఫైటర్‌జెట్ ఎస్కార్ట్ ముగిసిన అంత్యక్రియలు
ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇరాక్ నుంచి ఫైటర్ జెట్ ఎస్కార్తో ఇరాన్‌కు తరలించారు.మషాద్‌లో గురువారం సాయంత్రం ఖమేనీని ఖననం చేశారు. మషాద్‌లో లక్షలాది మంది ఇరాన్ ప్రజలు ఆ దేశ జెండాలు పట్టుకుని అంతిమ వీడ్కోలు పలికారు. ఖమేనీతో పాటు అతని మనవరాలు, కూతురు, అల్లుడు, మొజ్తబా ఖమేనీ భార్యను కూడా ఖననం చేసినట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

