సరిపడినన్ని దరఖాస్తులు అందాయ్
అమెరికన్ పార్లమెంట్ నిర్దేశించినట్టుగా 2023 ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్-1బీ వీసాల జారీకి సరిపడినన్ని దరఖాస్తులు అందినట్టు ఆ దేశంలోని ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలోని కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం అవసరమైన పోస్టుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు హెచ్-1బీ వీసా వీలుకల్పిస్తుంది. ఇది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు.. ఈ వీసాపై ఆధారపడి ఏటా భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేలమంది ఉద్యోగులను
- హెచ్-1బీ వీసాలపై యూఎస్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కీలక ప్రకటన
- మినహాయింపుల పిటిషన్ల స్వీకరణ, ప్రాసెస్ ఉంటుందని వివరణ
- ఎంపిక కానివారికి సందేశాలు.. రెండో విడుత లాటరీ లేనట్టేనా!
వాషింగ్టన్, ఆగస్టు 24: అమెరికన్ పార్లమెంట్ నిర్దేశించినట్టుగా 2023 ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్-1బీ వీసాల జారీకి సరిపడినన్ని దరఖాస్తులు అందినట్టు ఆ దేశంలోని ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలోని కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం అవసరమైన పోస్టుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు హెచ్-1బీ వీసా వీలుకల్పిస్తుంది. ఇది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు.. ఈ వీసాపై ఆధారపడి ఏటా భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేలమంది ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. విదేశీ వృత్తి నిపుణుల్లో వర్క్ వీసా తర్వాత హెచ్-1బీ వీసాకే ఎక్కువ ఆదరణ ఉన్నది. అమెరికన్ కాంగ్రెస్ నిర్దేశించిన గరిష్ఠ పరిమితి మేరకు.. 2023లో 65 వేల హెచ్-1బీ వీసాలతోపాటు అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు పథకం కింద మరో 20 వేల హెచ్-1బీ వీసాల జారీకి అవసరమైనన్ని దరఖాస్తులు వచ్చినట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
రిజిస్ట్రెంట్ల (నమోదుదారుల) ఆన్లైన్ ఖాతాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపామని, వీసాలకు ఎంపికకానివారికి ‘నాట్-సెలెక్టెడ్’ అనే సందేశం వస్తుందని పేర్కొన్నది. పరిమితి నుంచి మినహాయింపులున్న పిటిషన్లను మాత్రం స్వీకరించి, ప్రాసెస్ చేస్తామని తెలిపింది. దీంతోపాటు ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు హెచ్-1బీ వీసా గడువు పొడిగింపు, ఉద్యోగ నిబంధనల మార్పు, కొత్త కంపెనీల్లో పనిచేసేందుకు వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని యూఎస్సీఐఎస్ వివరించింది.
అప్పుడే ఇలాంటి సందేశాలు
అమెరికాలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసే 2023 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాలకు రెండవ లాటరీ నిర్వహించకపోవచ్చని తెలుస్తున్నది. ఈ వీసాలకు ఎంపిక కానివారికి ‘నాట్-సెలెక్టెడ్’ అనే సందేశాలను పంపుతుడటమే ఇందుకు సంకేతమని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్తున్నారు. ‘ఈ ఏడాది హెచ్-1బీ వీసాలకు రెండవ లాటరీ నిర్వహించకపోవచ్చు. ఈ వీసాలకు ఎంపికకాని పలువురి ఆన్లైన్ అకౌంట్లకు యూఎస్సీఐఎస్ ‘నాట్-సెలెక్టెడ్’ అనే నోటీసులను పంపుతున్నది. మరిన్ని లాటరీలు నిర్వహించకూడదనుకొన్నప్పుడే ఇలాంటి నోటీసులు పంపుతారు’ అని ‘ఇమ్మిగ్రేషన్.కామ్’ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఖన్నా తెలిపారు. అయితే దీనిపై యూఎస్సీఐఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

