న్యూయార్క్: అమెరికా సెంట్రల్ కమాండ్(US Central Command) ఓ ప్రకటన చేసింది. ఇరాన్‌లోని సుమారు 90 టార్గెట్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసినట్లు సెంట్కామ్ తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో కమర్షియల్ షిప్పింగ్, సివిలియన్ మెరైనర్స్ను అటాక్ చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఇరాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కోస్టల్ సర్వియలెన్ష్ అసెట్స్, మిస్సైళ్లు, డ్రోన్ స్టోరేజ్ సైట్లు, నేవీ సామర్థ్యం, మిలిటరీ లాజిస్టిక్స్ సదుపాయాలపై దాడి చేసినట్లు అమెరికా పేర్కొన్నది. వరుసగా రెండోసారి ఇరాన్ కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. జూలై 7వ తేదీన 80 ఇరానీ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు సెంట్కామ్ తెలిపింది. దీంట్లో ఐఆర్‌జీసీకి చెందిన 60 చిన్న బోట్లు కూడా ఉన్నట్లు సెంట్కామ్ చెప్పింది. హోర్ముజ్ జలసంధిలో మూడు కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా అమెరికా సర్ప్రైజ్ అటాక్ చేసింది. అమెరికా దళాలు నిత్యం పహారాతో ఉన్నట్లు సెంట్కామ్ పేర్కొన్నది.
— U.S. Central Command (@CENTCOM) July 9, 2026