అమెరికాలో నిలిచిన బ్యాంక్ సేవలు
జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్‌లో సాఫ్ట్వేర్ లోపం తలెత్తడంతో సోమవారం అమెరికాలోని పలు పెద్ద బ్యాంకుల వేలాది మంది ఖాతాదారులు ఖాతాల్లోకి లాగిన్ కావడం, లావాదేవీలు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- బగ్ కారణంగా అంతరాయం
- వేలాది ఖాతాదారులకు ఇబ్బందులు
- మైక్రోసాఫ్ట్ తర్వాత మరో ఘటన
న్యూయార్క్: జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్‌లో సాఫ్ట్వేర్ లోపం తలెత్తడంతో సోమవారం అమెరికాలోని పలు పెద్ద బ్యాంకుల వేలాది మంది ఖాతాదారులు ఖాతాల్లోకి లాగిన్ కావడం, లావాదేవీలు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చేజ్, వెల్స్ ఫార్గో, యూఎస్ బ్యాంక్, ట్రూయిస్ట్లకు సంబంధించి సేవలు నిలిచిపోయాయని తెలిపే ఫిర్యాదులు డౌన్‌డిటెక్టర్‌లో పెరిగాయి. అమెరికాలోని ప్రధాన బ్యాంకులు ఉపయోగించే డిజిటల్ చెల్లింపుల వేదిక జెల్లె సేవలపైనా ఖాతాదారులు ఫిర్యాదులు చేశారు. అమెరికాలో అతిపెద్ద బ్యాంక్ అయిన చేజ్, హార్డ్‌వేర్ వ్యవస్థల్లో సాఫ్ట్వేర్ బగ్ కారణంగానే అంతరాయం ఏర్పడిందని తెలిపింది. ఇది సైబర్ దాడి కాదని, ఘటనకు సైబర్ సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేసింది. ఖాతాదారులు తమ ఖాతాలు, నిధులను యథావిధిగా వినియోగించుకోవచ్చని, అయితే కొన్ని లావాదేవీలు పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతున్నదని బ్యాంక్ పేర్కొంది. ఖాతాల్లోకి లాగిన్ కావడం, నిల్వలు తెలుసుకోవడం, నగదు బదిలీలు చేయడంలో ఇబ్బందులు ఉన్నట్టు చేజ్ ఖాతాదారులు వేల సంఖ్యలో ఫిర్యాదు చేశారని డౌన్‌డిటెక్టర్ నమోదు చేసింది. యాప్ స్టోర్, ఐక్లౌడ్, యాపిల్ పే సహా పలు యాపిల్ కంపెనీ సర్వీసుల్లో మంగళవారం అమెరికా అంతరాయం ఏర్పడినట్టు డౌన్‌డిటెక్టర్ తెలిపింది.
ఎన్ఎస్ఏ రహస్య నెట్వర్క్ డౌన్
అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) అంతర్గత రహస్య సమాచార నెట్వర్క్ పనిచేయడం నిలిచిపోయిందని సీఎన్ఎన్ మంగళవారం తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం దీనిపై సైబర్ దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సిబ్బందిని ఆలస్యంగా కార్యాలయాలకు రావాలని సూచించారని పేర్కొంది. సంస్థ అంతర్గత సమాచార మార్పిడికి ఉపయోగించే అత్యంత రహస్య నెట్వర్క్ డౌన్ అయిందని, విషయం తెలిసిన ఐదుగురు వ్యక్తులను ఉటంకిస్తూ సీఎన్ఎన్ పేర్కొంది. గత వారం అమెరికా ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయం, విమానాల ఏటీసీ టెలికమ్యూనికేషన్ అంతరాయం, బ్యాంకుల సమస్యల తర్వాత ఇది నాలుగో పెద్ద సాంకేతిక సమస్యగా నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

