పీసీబీలో కుర్చీకోసం పాకులాట
కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూరుస్తుంది.
- ఎన్జీసీ డైరెక్టర్ పోస్టుకు తీవ్ర పోటీ
- ముగ్గురు ఉన్నతాధికారుల పైరవీలు
- తీవ్ర పోటీ ఉండటంతో జాప్యం
- మూడు నెలలు దాటుతున్నా నిర్లక్ష్యం
- ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టిన ఉన్నతాధికారులు
నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్జీసీ) డైరెక్టర్ సీటు కాలుష్య నియంత్రణ మండలిలో హాట్ సీట్‌గా మారింది. ఆ స్థానంలో కూర్చోవడానికి పీసీబీ ఉన్నతాధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ స్థానంలోకి రావడానికి ముగ్గురు ఉన్నతాధికారులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది.
ఎన్జీసీ డైరెక్టర్ స్థానం ఖాళీ అయి మూడు నెలలు అవుతున్నా.. ఆశావహుల్లో తీవ్ర పోటీ ఉండటంతో భర్తీ చేయడంలో జాప్యం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్జీసీ ఖాతాలో కోటి రూపాయలు ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొన్నది.
సిటీ బ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూరుస్తుంది. గడిచిన మూడు నెలలుగా ఎన్జీసీ డైరెక్టర్ లేకపోవడంతో ఆ నిధులు కూడా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఔట్ సోర్సింగ్ సిబ్బందే హాజరు కావాల్సి వస్తుంది. ఢిల్లీ నుంచి జరిగే వర్చువల్ సమావేశాల్లో కూడా వాళ్లే పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది.
వీలైనంత తొందరగా పీసీబీలోని అర్హత కలిగిన ఉన్నతాధికారిని డైరెక్టర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదేశించి నెల రోజులు దాటుతున్నా సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఫైలును తన దగ్గర నుంచి కదలనీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఫైలు ముందుకు కదలనీయడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జాప్యం జరుగుతుండటంతో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ముగ్గురు ఉన్నతాధికారుల మధ్య పోటీ?
ఎన్జీసీ డైరెక్టర్ స్థానం ఖాళీ అయి మూడు నెలలు దాటుతున్నా భర్తీ చేయకపోవడం వెనుక అసలు మర్మం ఏంటనే చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీని వెంటనే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసి నెల దాటుతున్నా ఫైలు ముందుకు కదలకపోవడం వెనుక అనేక పరిణామాలు జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా కాలుష్య నియంత్రణ మండలిలోని జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు(జేసీఈఎస్)ను ఎన్జీసీ డైరెక్టర్‌గా నియమిస్తారు. కానీ ప్రస్తుతం ఆయనతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు ఆ కుర్చీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు పీసీబీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈనేపథ్యంలోనే ఇద్దరు ఎస్ఈఎస్లు తమకు సన్నిహితంగా ఉండే ఉన్నతాధికారుల వద్ద ఎన్జీసీ డైరెక్టర్ పోస్టు ఇప్పించాలని మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్జీసీ డైరెక్టర్ సీటులో కూర్చునేందుకు సచివాలయానికి కూడా తరచూ వెళ్లి వస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈనేపథ్యంలో ముగ్గురి మధ్య నెలకొన్న తీవ్ర పోటీ వల్ల ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక జాప్యం చేస్తున్నట్లు పీసీబీ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
గతంలో సీనియర్ సోషల్ సైంటిస్టు ఎన్జీసీ డైరెక్టర్ స్థానంలో ఉన్నారు. దీంతో ఇద్దరు ఎస్ఈఎస్లలో ఒకరు సీనియర్ సోషల్ సైంటిస్టు పోస్టు తీసుకుని ఎన్జీసీ డైరెక్టర్ స్థానంలో కూర్చునేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగు చర్చ జరుగుతున్నది. ఏదిఏమైనా చైర్మన్, మెంబర్ సెక్రెటరీ ఈ వ్యవహారంపై దృష్టిసారించి వీలైనంత తొందరగా ఎన్జీసీ డైరెక్టర్ స్థానాన్ని భర్తీ చేయాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

