వాషింగ్టన్: తర్వాతి మహమ్మారి బర్డ్ ఫ్లూ నుంచి రావొచ్చని అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నిరోధక సంస్థ(సీడీసీ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ అంచనా వేశా రు. అమెరికాలోని ఆవుల మందల్లో బర్డ్ ప్లూ వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళన గురించి ఆయన ఒక వార్తా చానల్‌తో మాట్లాడారు. కొవిడ్‌తో పోలిస్తే మనుషుల్లో బర్డ్ ఫ్లూతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కొవిడ్ మరణాల రేటు 0.6%కాగా.. బర్డ్ ఫ్లూ వల్ల అది 25-50 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.