వ్యాక్సిన్ వేసుకోకపోతే జాబ్ పోయినట్టే.. వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులను తీసేయనున్న ఆ సంస్థ
ఇది కరోనా యుగం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ. ఫస్ట్ వేవ్ పోయింది. సెకండ్ వేవ్ పోయింది. ఇప్పుడు థర్డ్ వేవ్‌లో ఉన్నాం మనం. ఈమధ్య డెల్టా వేరియంట్‌తో పాటు ఒమిక్రాన్ కూడా అందరినీ భయపెడుతోంది. ఇప్పటికే చాలామంది రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నారు. పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్నవాళ్లకు కరోనా సోకినా కూడా పెద్దగా సమస్యలు రావడం లేదు. ఒక వారం రోజులు మెడిసిన్ వాడితే తగ్గిపోతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నారు.

కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతున్నాయి. అయినా కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసుకు వస్తే ఉద్యోగంలో నుంచి తీసేసేందుకు కూడా కొన్ని కంపెనీలు వెనుకాడటం లేదు.
యూఎస్‌కు చెందిన ప్రముఖ టెలికాం నెట్వర్క్ కంపెనీ టీ మొబైల్ కూడా ఫుల్ వ్యాక్సినేషన్ చేయించుకోని ఉద్యోగులను తీసేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 2, 2022 లోపు ఫుల్ వ్యాక్సినేషన్ వేసుకోని కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
యూఎస్ సుప్రీం కోర్టు రూలింగ్ ప్రకారం టీ మొబైల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 21 లోపు ఫస్ట్ డోస్ తీసుకోని ఉద్యోగులు, ఫస్ట్ డోస్ తీసుకుంటే దాని ప్రూఫ్ అప్లోడ్ చేయకపోతే.. వాళ్లను అన్పేడ్ లీవ్ కింద పరిగణిస్తాం అని కంపెనీ ఉద్యోగులకు మెయిల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఏప్రిల్ 2 లోపు పూర్తిగా వ్యాక్సినేషన్ వేసుకోకపోతే వాళ్లను కంపెనీ నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగిస్తాం అని కంపెనీ స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

