టెహ్రాన్: నటాంజ్ అణు కేంద్రం(Natanz Facility)పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినట్లు ఇవాళ ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఈ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు తమ క్రిమినల్ దాడులు కొనసాగిస్తున్నాయని, ఇవాళ ఉదయం నటాంజ్ శుద్దీకరణ కాంప్లెక్స్‌పై దాడి జరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఆ ప్రకటన జారీ చేసింది. సెంట్రల్ ఇరాన్లో ఉన్న నటాంజ్ అణు కేంద్రం నుంచి ప్రస్తుతానికి ఎటువంటి అణుధార్మికత రిలీజ్ కావడం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మార్చి మొదటి వారంలో కూడా నటాంజ్ అణు క్షేత్రంపై దాడి జరిగింది. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న యురేనియం శుద్దీకరణ కాంప్లెక్స్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇటీవల అంతర్జాతీయ అణు ఏజెన్సీ ప్రకటించింది. కానీ ఆ దాడిలో యురేనియం శుద్దీకరణ ప్లాంట్ ఎంట్రెన్స్ ధ్వంసమైనట్లు ఐఏఈఏ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.
రేడియోయాక్టివ్ లీకేజీలు లేవని, సైట్ వద్ద ఉన్న స్థానికులకు కూడా ఎటువంటి రిస్క్ లేదని తస్నిమ్ తన ప్రకటనలో చెప్పింది. యురేనియం శుద్దీకరణ చేసే సత్తా ఇక ఇరాన్‌కు ఉండబోదని తాజాగా నెతన్యహూ, ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.