పారిస్: ఇరాన్‌పై ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా ఇరాన్ ప్రతిదాడులు చేస్తున్నది. ఆ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలు పాట్రియాట్ క్షిపణుల(Patriot Interceptor Missiles)ను వాడుతున్నాయి. అయితే ఇరాన్‌తో యుద్ధం మొదలైన మొదటి అయిదు రోజుల్లోనే అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలు సుమారు 800 పాట్రియాట్ ఇంటర్సెప్టార్ క్షిపణులను వాడినట్లు యురోపియన్ యూనియన్ రక్షణశాఖ మంత్రి ఆండ్రియస్ కుబిలియస్ తెలిపారు. ఇంటర్సెప్టార్లను అంతగా వాడారంటే .. ఆ సంఖ్యను ఉత్పత్తి చేయాలంటే అమెరికాకు ఒక్క ఏడాది కాలం పడుతుందని ఆయన అన్నారు.
గణాంకాలను పరిశీలిస్తే ఈ అంశం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అమెరికా ప్రతి ఏడాది సగటును కేవలం 750 పాట్రియాట్ ఇంటర్సెప్టార్ క్షిపణులను మాత్రమే ఉత్పత్తి చేయగలదన్నారు. ఆధునిక యుద్ధంలో ఆయుధాల వినియోగం పెరిగిందని, యురోపియన్ దేశాలు కూడా తమ ఆయుధ సంపదను పెంచుకోవాలన్నారు. ఇటీవల తక్కువ ఖర్చు గల షాహిద్ డ్రోన్లతో ఇరాన్ పెను విధ్వంసం సృష్టించింది. కానీ అమెరికా తన దాడి కోసం ఖరీదైన ఇంటర్సెప్టార్ క్షిపణులను వాడాల్సి వచ్చింది. ఆయుధ నిల్వలు తక్కువగా ఉన్న కారణంగా.. ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు 133 మిలియన్ల డాలర్లతో ఫండ్‌ను క్రియేట్ చేస్తున్నట్లు కుబిలియస్ తెలిపారు.
🇪🇺 The U.S. and Gulf countries used 800 Patriot missiles in the first five days of the Iran war, says EU Defense chief Andrius Kubilius But “their whole production … is 750 per year.”
The figures make clear Europe needs to develop its own capacity, he added.
🔗 POLITICO pic.twitter.com/dNZhjQVnel
— The Daily News (@DailyNewsJustIn) March 24, 2026
ఇక ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్‌కు అమెరికా సిద్దమైనట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. ఆ మీడియాకు చెందిన జర్నలిస్టు అలెక్స్ వార్డ్ ఓ కథనాన్ని రాశారు. భూతల దాడికి చెందిన ప్లానింగ్ జరిగిందని, ఎప్పడైనా ఆ ఆపరేషన్ చేపట్టవచ్చు అని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేతలు, హౌజ్, సేనేట్ ప్రతినిధులకు కూడా ఈ సమాచారం తెలిసినట్లు వెల్లడించారు.